దేవుళ్ళకే కాదు  దయ్యాలకి ఒక పండగ వుంది. మన దేశంలో చనిపోయిన వాళ్ళకి సంవత్సరీకం చేసినట్లు చాలా దేశాల్లో చనిపోయిన వారి జ్ఞాపకంగా పండగ చేస్తారు. ది హంగ్రీ గోస్ట్ ఫెస్టివల్ పేరుతొ చైనాలో నిర్వహించే పండగ ఎక్కువ ప్రాచుర్యం పొందింది. చనిపోయిన వాళ్ళ ఆత్మలు తమ వారిని కలుసుకునేందుకు వస్తారని వాళ్ళ నమ్మకం. దివి నుంచి భువికి దిగివచ్చిన ఆత్మల దృష్టి మరల్చి గుళ్ళ పైకి పంపేందుకు గోస్ట్ మాస్టర్ రూపంలో బ్రహ్మాండమైన దిష్టి బొమ్మను తయారు చేసి దగ్ధం చేస్తారు. గోస్ట్ బొమ్మను అలంకరించి కాగితాలు ఇతర వస్తువులు చైనాలో ప్రత్యేకంగా తయారు చేస్తారు . చనిపోయిన వాళ్ళకు ఇష్టమైన వంటలు చేసి నివేదిస్తారు. ఈ పండగ భారీ ఎత్తున జరుగుతోంది.

Leave a comment