ఈ చలిరోజుల్లో పెదవులు చిట్లటం పైపొర లేచినట్లు పొట్టు రాలడం సహజం. వేడి కాఫీ తాగటం, పని ఒత్తిడి ఇతర మందులు కారణంగా పెదవులు తేమను కోల్పోయే ప్రమాదం ఉంది. ఐదు మిల్లీలీటర్ల గ్లిజరిన్ అంతే మోతాదులో నిమ్మరసం పన్నీరు కలిపి ఉదయం సాయంత్రం పెదవులకు రాసి ఆరిపోయే వరకూ అలాగే ఉంచాలి. నీళ్లలో గ్లిజరిన్, వాజలైన్,తేనె కలిపి ఆ నీటిలో దూదిని ముంచి పెదవులకు తడి చేయచ్చు. అలాగే లిప్ స్టిక్ లో ఉండే పదార్థాల జాబితాను చూసి సరిచూసుకోవాలి. బ్రాండెడ్ కంపెనీలు తప్పనిసరిగా ఈ లిస్ట్ ను ఇస్తాయి. మాయిశ్చరైజర్ ఉన్న లిప్ స్టిక్ ఉపయోగించాలి. సాధారణంగా లిప్ స్టిక్ లలో గ్లిజరిన్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి.

Leave a comment