సిక్సిటీ టు లైఫ్ స్టైల్ చేంజెస్ అనే పుస్తకం వచ్చింది . దీన్ని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లూక్ కౌటింవ్వో ,సినీనటి అనుష్క కలసి రాశారు . పెంగ్లిన్ రాండమ్ హౌస్ ప్రచురించిన ఈ పుస్తకంలో బరువు తగ్గేందుకు,అనారోగ్యం నుంచి బయట పడేందుకు . కఠోరమైన ఆహార నియమాలు వ్యాయామాలు అవసరం లేకుండా సులభంగా ఆచరించ గల జీవన శైలి మార్పుల గురించి చక్కగా చెప్పారు . ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ అనుష్క ,నటీనటులు ఒక నిర్ణీతమైన బాడీ షేప్ లో ఉండాలని అనుకొంటారు . నేనూ రకరకాల పద్ధతులు అనుసరించే దాన్ని . అవి నా ఆరోగ్యాన్ని ఎంతో దెబ్బ తీశాయి . సినిమా తారాలకు ఫాన్స్ లైఫ్ స్టయిల్ ఏమి ఉండదు . 24 గంటలు వెంటవుండి వన్దివడ్డించే వాళ్ళు ఉండరు ఎంతో వత్తిడి ఉన్న జీవితం లోంచి ఎంతగానో బాలెన్స్ చేయటం నేర్చుకున్నాను . జీవన శైలిలో ఎన్నో మార్పులు తెచుకొన్నాను . ఈ పుస్తకంలో ఆ అనుభవాలు ఎన్నో రాశాను అంటోంది .

Leave a comment