తెలుగులో ఎందుకు రావో,ప్రేక్షకులకు మరి నచ్చవేమో తెలియదు కానీ ఇరానియన్ మూవీ ‘The Mirror’ చూసి తప్పకుండా ప్రేమలో పడతారు.డైరక్టర్ జాఫర్ పనాబీ ఒక చిన్ని పాప పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ సినిమా సృష్టిచారు.ఒక మహా నగరంలో ఒక చిన్న పాప ఒక్కటే ఇంటికి చేరుకోవాలి అంటే ఎలాంటి సిట్యూయేషన్స్ ఎదుర్కొన్నదో ఈ చిత్రకథ ఒకటో తరగతి పాప తల్లి కోసం ఎదురు చూస్తూ నిలబడింది.అందుకు ఒఖ్ఖళ్ళు వెళ్ళిపోయారు. మా అమ్మ రాకపోతే ఎలా? అని ఆ పాప ప్రశ్నకు సమాధానం రాలేదు. అక్కడ నుంచి ఇంటి వరకు ఆ పాప ప్రయాణం ఈ సినిమా…ప్రపంచ వ్యాప్తంగా ఎణ్నో ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ లో అవార్డులు తెచ్చుకున్న ఈ సినిమా తప్పకుండా చూడండి. అమ్మా నాన్న అనటం తప్ప వాళ్ళ పేర్లు వివరాలు ఇల్లు అడ్రస్ ఏదీ తెలియని ఈ పాప కథకు అవార్డులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి.

Leave a comment