ముక్కెరలు,ముక్కు పుడకలు ఎప్పుడూ ఫ్యాషనే. ముక్కుకు రంద్రం వేయించుకొని,లేదా ముక్కు తమ్మెకు పైన చేసుకొనే రకం అయినా అమ్మాయిలు ఒకే అనేస్తారు. ప్లాటినమ్ తో ఒంటి వజ్రం ఉన్న ముక్కుపుడక టీనేజర్లకు చక్కగా సూట్ అవుతోంది. ఎలాంటి నగలేకపోయినా ఆ ఒక్క ముక్కుపుడకలో ఎంతో ఆధునికంగా కనిపించవచ్చు. రోజ్ గోల్డ్ లో వజ్రాలు పొదిగిన ముక్కుపుడక కు ప్రాధ్యాన్యత ఇవ్వాలి. దుస్తులతో,అలంకరణతో మ్యాచ్ అయ్యేలా రాళ్ళు పొదిగినవి,వేలాడే ముత్యం మువ్వలు ఉన్నవి కూడా బావుంటాయి. ముక్కు లోపలి నుంచి సీల బిగించేవి అయితే దాన్ని బిగించే వీలు సౌకర్యంగా ఉండేలా చూసి ఎంచుకోవాలి.

Leave a comment