దేశంలో కరోనా వైరస్ ను విజయవంతంగా పారద్రోలిన తొలి ప్రాంతంగా నిలచింది రాజస్థాన్ లోని భిల్వారా పట్టణం.దేశంలో మొదట ప్రకటించిన హాట్ స్పాట్ లలో ఇది ఒకటి. ఈ విజయం వెనక ఉన్నారు ఐఎఎస్ అధికారిణి టీనా దాబి. సివిల్ సర్వీసెస్ లో మొదటి ర్యాంక్ తెచ్చుకొన్న తోలి దళిత మహిళగా ఈమె చరిత్ర సృష్టించారు ప్రస్తుతం భిల్వారా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్నారు. మర్చి 19 న బిల్వారా లో కరోనా తోలి పాజిటివ్ కేస్ నమోదైంది. లాక్ డౌన్ హెల్త్ ఎమెర్జెన్సీ కనుక ఎంతో సహనం తో టీనా అక్కడి ప్రతి సమస్యను పరిష్కరించారు. కరోనా పేషెంట్ల కు చికిత్స,నిత్యావసర వస్తువులు ప్రజలకు అందించటం వైరస్ విషయంలో ప్రజల్లో అవగాహన తేవటం, వంటివి మిగిలిన అధికారులతో కలుపుకొని శ్రద్దగా అమలు పరిచారు. భిల్వారా పట్టణం లో కట్టదిట్టమైన నియంత్రణలు కరోనా వైరస్ ను అణిచి వేసిన ఘనత టీనా దాబి కే చెందుతోంది.

Leave a comment