కొబ్బరి నూనె కండీషనర్ గాను పనిచేస్తుంది అంటారు ఎక్సపర్ట్స్.ఇందులో విటమిన్-ఇ ఇనుము ఉంటాయి.అలాగే ఆముదంలో ప్రొటీన్లు ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు ఉంటాయి.ఈ రెండింటిని కలిపి రాస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.రాత్రి పడుకునే ముందుర ఈ రెంటినీ కలిపిన మిశ్రమాన్ని ఒక చుక్క కనుబొమ్మలకు రాసి చక్కగా మర్దన చేయాలి.ప్రతి రోజు ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. కొబ్బరి నూనె ఆముదం లో అలోవెరా గుజ్జు కూడా కలిపి రాస్తే ఇందులో జెల్ ఉండటం వల్ల చర్మం త్వరగా పీల్చుకొంటుంది. ఈ గుజ్జులో ఉండే అలోనిన్ కనుబొమ్మలు బలంగా పెరిగేలా చేస్తుంది.

Leave a comment