రంగు లేని ప్రకృతి ఊహించటం అసాధ్యం కొన్ని వందల వేల రకాల రంగుల్లో పూలు, చెట్లు, ఆకాశం అన్ని రంగులమయం.కళ్ళని ఆకర్షించేది వస్తువుల రంగులే రంగులో ఉండే ఆకర్షణ శక్తి అమోఘం. రంగులు జాతీయ, ప్రాంతీయ భేదాలు లేకుండా ఒకే రకమైన భావోద్వేగాలు కలిగిస్తాయి అంటున్నారు అధ్యయనకారులు ఒక్క రంగులో ఒక రకమైన భావోద్వేగాలు అందరిలో ఒకే రకంగా ఉన్నాయని అధ్యయనాలు తేల్చాయి. ఎరుపు రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పసుపు వర్ణం ఆనందాన్ని ఇస్తుందని ఈ ప్రపంచంలో ఏ మూల చూసినా ఇదే సమాధానాలు వచ్చాయి.కొన్ని ప్రాంతాల్లో రంగులకు సాంప్రదాయాలకు ముడిపడి ఉన్నాయి అవి మినహాయిస్తే వర్ణాల ప్రభావం విభిన్న వ్యక్తులపై ఒకే మాదిరిగా ఉంటుందన్నారు నిపుణులు.

Leave a comment