ఫిట్ నెస్ లక్ష్యాలు పెట్టుకోవటం సులభమే ఆ లక్ష్యాలను అందుకునేందుకు అంకితభావం అత్యవసరం అంటోంది సమీరా రెడ్డి. ఫిట్ నెస్ ఫ్రైడే చాలెంజ్ లో ఒక నెలలో రెండు కిలోలు బరువు తగ్గి చూపించారామే. ఈ చాలెంజ్ గురించి ఇంస్టాగ్రామ్ లో వివరంగా చెబుతోంది సమీరా నేను 92 కిలోలు బరువున్నాను. ఒక నెలలో రెండు కిలోలు లక్ష్యం పెట్టుకున్నాను ఫిట్ నెస్ ఫ్రైడే ఛాలెంజ్ మొదలుపెట్టాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే కొన్ని గంటల లోపే తినటం కొన్ని గంటల పాటు ఫాస్టింగ్ ఉండటం నాకు ఎంతో ఉపయోగపడింది.రోజులో  16 గంటల ఉపవాసం మిగతా ఎనిమిది గంటల్లో ఏదైన తినటం చేస్తోంది. యోగా చేస్తూ ఒక నెలలో రెండు కిలోలు తగ్గాను అని చెబుతోంది సమీరారెడ్డి.

Leave a comment