ప్రాచీనులు పర్వదినాల్లో ఎం చేయాలని చెప్పిన దాని వెనుక ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉండి తీరుతుంది. ఈ కార్తీక మాసం లో దీపాలు వెలిగిస్తారు. ఆ వెలిగే దీపపు వెలుగు సాక్షాత్తు భగవంతుడి రూపమని,ఆ జ్యోతి లో దైవాన్ని దర్శించాలని దీపోత్వం చెపుతోంది చలి పెరుగుతున్న ఈ రోజుల్లో ఎన్నో క్రిమికీటకాలు బలంగా పెరుగుతూ ఉంటాయి. వాటిని పనిగట్టుకొని చంపటం నేరం. ఈ దీపాల వెలుగులు ఈ జ్వాలకు ఆకర్షింపబడి ఎన్నో కీటకాలు చనిపోతాయి ఇది కూడా దీపాలు వెలిగించటం లో ఒక కారణం కావచ్చు. అలాగే నేతి దీపం తో వచ్చే పొగ శ్వాసకోశ వ్యాధులను రానివ్వదు.

Leave a comment