భారతదేశంలో ఎన్నో కుటుంబాల్లో పిల్లలు మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక హింస ప్రధానంగా తీసిన చిత్రం గజేంద్ర అహిరే దర్శకత్వం  వహించిన ఈ మరాఠీ చిత్రం లో Sairat దర్శకుడు నాగరాజ్ మంజులే,అంజలి పాటిల్ నటించారు  కొంకణ్ లో  పీచు మిఠాయి అమ్మే తండ్రితో కలిసి ఉండే చిన్ని ని, యుక్తవయసులో తాను పెంచలేక పోతానని మామ ఇంటికి పంపిస్తాడు తండ్రి. మామ చిన్ని పై అత్యాచారం చేస్తాడు. ఆ పసితనంలో ఆ  పాప మనస్సులో ఈ లైంగిక హింస ఎప్పటికీ మరిచిపోలేని పీడ కలలాగ నిలిచిపోయి వేధిస్తుంది.సాధారణంగా ఇటువంటి హింస చుట్టూ పేరుకుపోయిన నిశ్శబ్దాన్ని చిన్ని ఎలా చేదించుకు వచ్చిందో ఈ సినిమా.జాతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో సైలెన్స్ ఎన్నో అవార్డులు గెలుచుకుంది.యదార్ధ గాధ గా చెబుతున్న ఈ సినిమా తప్పనిసరిగా చూడండి.

రవిచంద్ర. సి    
7093440630 

 

Leave a comment