వంటింటి చిట్కాల తో ఎప్పుడూ పని సులభతరం అవుతుంది. పుస్తకాలు ఉంచే అలమారలో ఎండిన వేపాకులు ఉంచితే చెద పురుగులు పట్టవు.ముత్యాల నగల తెల్లదనం పోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఆలివ్ నూనెతో తుడవాలి.వెండి పాత్రలో కర్పూరం బిళ్లలు  వేస్తే నల్లబడకుండా ఉంటాయి. కాఫీపొడి వాసన పోకుండా ఉండాలంటే గట్టి మూత ఉన్న డబ్బాలో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి.గంజిలో కాస్త ఉప్పు వేసి బట్టలు ఉతికితే అవి మరింత తెల్లగా ఉంటాయి .యాపిల్ మొక్కలు రంగు మారకుండా ఉండాలంటే మొక్కల పైన నిమ్మరసం చల్లితే చాలు. నిమ్మచెక్కతో తుడిస్తే కత్తులు కత్తిపీట లకు అంటిన ఉల్లిపాయ వాసన పోతుంది.

Leave a comment