చిన్న చిట్కాలు వంటింటి పనిని సులభం చేస్తాయి. బత్తాయి నారింజ వంటి సిట్రస్ పండ్ల తొక్కను తీయటం కష్టంగా ఉంటే కొన్ని సెకండ్ల పాటు మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టి తీస్తే తొక్క సులభంగా వచ్చేస్తుంది.చీజ్ తరగాలంటే చేతికి అంటుకుంటూ ఉంటుంది. చేతికి కాస్త ఆయిల్ రాసుకుంటే చీజ్ చేతికి అంటుకోదు.గుడ్లు పగలగొట్టాక ఎగ్ వైట్ నుంచి ఎల్లో భాగాన్ని వేరు చేయాలంటే ఖాళీ నీళ్ల బాటిల్ ఎగ్ యెల్లో దగ్గర గట్టిగా నొక్కి వదిలితే గాలి ఎల్లో ని బాటిల్ లోకి తీసుకుంటుంది.అరటిపండు పండిపోకుండా తాజాగా ఉండాలంటే ఆ గెలను నెలకు  గోడకు తాకకుండా గాలిలో తాడుతో వేలాడదీయాలి అలాగే అరటి పండును తొడిమ భాగానికి మెరిసే అల్యూమినియం కాగితం చుట్టినా పండిపోకుండా ఉంటుంది.

Leave a comment