ఉత్తర కొరియాలో 2005లో లోబడ్జెట్ తో తీసిన దవేహోమ్ సినిమా ఉత్తమ స్క్రీన్ ప్లే ,ఉత్తమ చిత్రంగా కొరియన్ అకాడమీ గోల్డెన్ బెల్ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా కథ రాసింది దర్శకత్వం చేసింది జియాన్ హాంగ్ లీ ఈ సినిమాకు అమ్మమ్మలందరికీ అంకితం ఇచ్చింది ఈవిడ.యూ సీంగ్-హోఅనే చిన్న పిల్లాడు పట్నంలో నివశించే వాడు, వాళ్ళమ్మ ఉద్యోగప్రయత్నం కోసం వెళితే పల్లెటూర్ లో ఉంటున్నా అమ్మమ్మ ఇంటికి ఓ నెల రోజులు అతిథిగా వస్తాడు. ఈ ముసలి అమ్మమ్మ ఆవిడ ఉండే మట్టి గోడల ఇల్లు ఆవిడ పేదరికం .ఈ నెల రోజులలోనూ కంప్యూటర్స్ తో ఆడుకొనే  సీంగ్-హో  కు నచ్చేస్తాయి. అమ్మమ్మను విడిచి వెళ్ళలేకపోయాడు .ఆ నెల రోజుల అమ్మమ్మ మనవళ్ళ జీవన ప్రయాణం ,అందమైన ఆప్యాయితల కథ ఈ సినిమా ది వేహామ్ వీలైతే చూడండి.

Leave a comment