ఈ ప్రపంచంలో ప్రతి రోజు తెల్లవారుతుందీ అంటే సూర్యుడు కనిపించటం .సూర్యుని వెలుగు కిరణాలతో రోజు మొదలు కావటం. కానీ ఈ జగత్తు కాంతి వెలుగులు పంచే సూర్యుడు కొన్ని ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది .ఇటలీ లోని వెగనెల్లా గ్రామం లో మూడు నెలల పాటు సూర్యుడు కనిపించాడు.ఈ గ్రామం చుట్టూ ఎత్తయిన పర్వతాలు ఉన్నాయి మూడు వందల జనాభా వున్న వెగనెల్లా గ్రామం ఓ పెద్ద పర్వతం కింద భాగంలో ఉంటుంది .పర్వతాలు సూర్యుని కిరణాలను ఈ ఊరిలోనీ నేలను తాకనివ్వవు. ఊరి ప్రజలు కొన్నేళ్ల క్రితం ఇక ఇంజనీర్ సలహాతో ఈ ఊరుని ఆనుకోని ఉన్న కొండపై 26 అడుగుల వెడల్పు 16 అడుగుల ఎత్తు ఉన్న అద్దాన్ని అమర్చుకుని సూర్యకిరణాలు ఆ అద్దం ద్వారా గ్రామం పై పడేలా ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద దీవి గ్రీన్ లాండ్ ఆర్కిటెక్ ,ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రాల మధ్య ఇరవై లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది .ఈ దీవి 85 శాతం మంచుతో కప్పబడి ఉంటుంది .ఈ ద్వీపంలో రెండు మూడు నెలలపాటు సూర్యుడు అస్తమించడు. మే నుంచి జూలై వరకు 24 గంటలు సూర్యకిరణాలు ప్రసరిస్తూనే ఉంటాయి .దాదాపు 20 లక్షల సీల్ చేపలు గ్రీన్ లాండ్ పరిసరాల్లో జీవిస్తున్నాయి ఒక అంచనా. ప్రపంచంలో ఎక్కడా కనిపించని అరుదైన పోలార్ బియర్లు (Polar Bear) ఉత్తర మధ్య గ్రీన్ లాండ్ పరిసరాల్లో జీవిస్తున్నాయి ఇకపోతే నార్వేలోని లాంగియర్ గ్రామంలో సంవత్సరానికి నాలుగు నెలలపాటు సూర్యాస్తమయం ఉండదు .24 గంటలు వెలుగే.మే నుంచి ఆగస్టు వరకు అలుపులేకుండా భానుడి కిరణాలు ప్రసరిస్తూనే ఉంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ పూర్తిగా చిమ్మ చీకటే. భూమికి ఉత్తరదిక్కున మనుషులు నివసించే చివరి ప్రాంతం ఇదే .
Categories