ఇల్లన్నాక చుట్టూ గోడలు తలుపులు ,కిటికీలు భద్రత కోసం తాళాలు అన్ని ఉంటాయి కదా . కానీ ఒడిసా రాజధాని భువనేశ్వర్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నా స్వాలియా అన్న గ్రామంలో దొంగతనాలు జరగవు . గ్రామస్థుల ఊరి చివర మర్రిచెట్టు క్రింద ఉండే భారకియా ఠాకు రాణి అమ్మవారిని పూజిస్తారు . ఆ దేవతే తమ ఊరి ని కాపలా కాస్తుందని గ్రామస్థుల నమ్మకం . పూర్వకాలం నుంచి ఇలా తలుపులు లేని ఇళ్ళే నిర్మించుకొంటారు . ఒకళ్ళిద్దరు ఎప్పుడో తలుపులు పెట్టుకొంటే అవి అగ్ని ప్రమాదం జరిగి కాలిపోయాయట అప్పటి నుంచి ఇంకెవళ్ళు తలుపులు జోలికి పోలేదు ప్రైవసి కి ఇబ్బంది అనుకొంటే ఒక కర్టెన్ లాంటిది వేసుకొంటారు అంతే .

Leave a comment