భారతీయ సంప్రదాయ ఆహార విధానంలో ఆరోగ్యం కలిపి ఉంటుంది . అలవాటుగా తినే ఇడ్లీ ,దోసె ,మజ్జిగలు ఒకరకంగా శరీరానికి  ఔషధాల్లానే పనిచేస్తాయి . శరీరంలో ఎన్నో రకాల సూక్ష్మ జీవులుంటాయి . జీర్ణవ్యవస్థ లో ఉండే బాక్టీరియా తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షించేందుకు పనిచేస్తాయి . పులిసేందుకు అవకాశం ఉన్నా వాటిలో మంచి బాక్టీరియా పుష్కలంగా ఉంటుంది . ఇడ్లీ ,దోసె లు ,గుజరాత్ డోక్లాలు వీటిని పిండిని ముందురోజే తయారు చేసి పులియ బెడతారు . అందులో తయారయ్యే బాక్టీరియా ను ప్రోబయోటిక్స్ అంటారు . వీటివల్లే రోగనిరోధక శక్తి పెరుగుతుంది . అందుకే ఆహారంలో ఈ పుల్లని పదార్దాలు ఉండాలి .

Leave a comment