ఉదయం అల్పాహారంగా పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోండి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.ఇడ్లీ, దోస వంటివి పులిసిన ఆహారం కాబట్టి వీటిలో ఆరోగ్యాన్ని పెంచే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది.రైస్, మినపప్పు ఉపయోగిస్తారు కాబట్టి ఇందులో ఎనర్జీ ప్రోటీన్ వంటివి కావలసినన్ని ఉంటాయి.వీటిని సాంబార్ తో తింటే మరి కాస్త  ప్రోటీన్ పెరుగుతుంది.నువ్వులు, పల్లీలు, పుట్నాల చట్నీలతో తింటే ఫైబర్ పెరుగుతుంది. అలాగే గారెల్లో కూడా ప్రోటీన్ ఎనర్జీ ఎక్కువే.పెసరట్టు శ్రేష్టమైన బ్రేక్ఫాస్ట్.అయితే ఏ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి ఎక్కువ వ్యాయామం చేసే అవకాశం లేదు కనుక సాధ్యమైనంత తక్కువ తినాలి .

Leave a comment