పగడాల నగలు ధరిస్తే రుణ విముక్తి ధన వృద్ధి అవుతాయని చెబుతారు ఎక్స్ప్రెస్ సముద్రపు అడుగున ఉన్న శిలలపై చేరిన పగడపు జీవాల లార్వా అతుక్కుని వాటి చుట్టూ ఏర్పరచుకునే రక్షణ కవచల నుంచి పగడాలు ఏర్పడతాయి. ప్రాచీన వైద్య పద్ధతుల్లో పగడాల విరివిగా వాడుతారు.పగడాలు కాల్చగా వచ్చే భస్మాన్ని ఇప్పటికి ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు.సాన బట్టిన పగడాలు ఎంతో మెరుపుతో ఉంటాయి. ఎరుపు నారింజ కాషాయ రంగుల్లో దొరికే ఈ పగడాలా జాతక రత్నలుగా ధరిస్తారు. నలుపు తెలుపు ఆకుపచ్చ రంగుల్లో దొరికే పగడాలు తో చేసిన నగలు ఆధునికమైనవి. కుజదోష నివారణ కోసం నాణ్యమైన పగడం ధరించమని జోతిష్య నిపుణులు చెపుతారు. ముత్యాల పగడాల అల్లికతో వచ్చే నగలు చాలా అందంగా ఉంటాయి.

Leave a comment