ముఖాన్ని శుభ్రం చేసుకొన్నట్లు చెవి వెనుక ,నాలుక,పదాలు అడుగుభాగం శుభ్రం చేయకపోవటం వల్ల ఆయా భాగాల్లో ఇన్ పెక్షన్లు వస్తాయి అంటున్నారు బ్యూటీ ఎక్స్ పర్డ్స్ . స్నానం చేసేప్పుడే చెవులు వెనుక సరిగ్గా రుద్దుకోవాలి . అలాగే మెడవెనుక కూడా లూఫా తో భాద రుదుకోవాలి . వీపు సరిగా అందదు కనుక బ్యాక్ స్క్రబ్బర్ లేదా లూఫా తో వీపు రుద్దు కోవాలి . పాదాల అడుగుభాగం అస్సలు పట్టించుకోరు . ప్యూమిస్ స్టోన్ తో పాదాల అడుగుభాగం రుద్దతే మృతకణాలు పోయి పాదాలు అందంగా కనిపిస్తాయి . వారంలో ఒక సారయినా మాడుకు నూనె మసాజ్ చేసి తలస్నానం చేయాలి . అలాగే దంతాలు చిగుళ్ళ తోపాటు నాలుక శుభ్రత పట్టించుకోవాలి .

Leave a comment