మెనోపాజ్ సమయంలో వచ్చే నెలసరి సమస్యలకు కొన్ని చిట్కాలు వైద్యులు చెబుతున్నారు. ఆయుర్వేద వైద్యులు నెలసరి ఆలస్యంగా వచ్చినా ముందే వస్తున్నా నువ్వుల పానీయం తీసుకోమంటున్నారు. టీ స్పూన్ చొప్పున నువ్వులు, పసుపు, సొంటి పొడి తీసుకొని అందులో గ్లాసు నీళ్లు పోసి సగం అయ్యేవరకు మరిగించాలి. తర్వాత ఓ స్పూన్ బెల్లం కలిపి గోరువెచ్చగా తాగాలి. నెలసరి ముందే వస్తుంటే కొత్తిమీర, సొంపు పానీయం తాగాలంటున్నారు. టీ స్పూన్ చొప్పున ధనియాలు సోంపు తీసుకుని అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషాలు మరిగించి, వడగట్టి తాగాలి దీని వల్ల అధిక రక్త స్రావం కూడా తగ్గిపోతుంది అంటున్నారు వైద్యులు.

Leave a comment