నిద్రపట్టక సతమతం అవుతున్నారా? అయితే కొద్దిగా స్వీట్ తినండి అంటున్నారు మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. కొన్ని వందల మందిపై నిద్రకు సంబంధించిన పరిశోధన చేశారు. తలలకు ఎలక్ట్రోడ్స్ అమర్చి ,రెండు రాత్రుల పాటు నిద్ర సమయంలో వచ్చే మార్పులు రికార్డ్ చేశారు. వీరికి పగటి వేళ కొన్ని షుగర్ డ్రింక్స్ ఇచ్చారు. నిద్ర పోయే ముందర చక్కెర ఆధారిత పదార్థాలు డ్రింక్స్ తాగిన వారు ,రాత్రి సమయంలో ఏడు, ఎనిమిది గంటల పాటు గాడ నిద్ర పోయినట్లు గమనించారు. తియ్యని పదార్థం తీసుకోవటం వల్లనే నిద్ర పోయినట్లు ఈ పరిశోధన తేల్చింది..

Leave a comment