కాస్టింగ్ కౌచ్ నిజమే అంటుంది ఏ మంత్రంవేశావే హీరోయిన్ శివాని సింగ్ . లేడీ ఆర్టిస్టులంటే కొంత చులకన ,ఆడపిల్లలు కాస్త భయంగా ,బెదురుగా కనిపిస్తే ఏడిపించేస్తారు. అదే తిరగబడితే తోక ముడుస్తారు. అన్నీ రంగాల్లో మహిళలకు అన్యాయమే .గతంలో కన్నా ఇప్పుడు అవకాశాలు పెరిగాయి నిజమే స్త్రీ పురుషులు సమానం అంటారు కానీ అవి చేతల వరకు రాలేదు. మనకి అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకొని బాధపడినా ప్రయోజనం శూన్యం. మనమే తిరగబడి మన సమస్యను పరిస్కరించుకోవాలి.చాలా మంది మౌనంగా ఉండి పోతారు. అలాంటి వాళ్ళలో మార్పు వస్తే అసలు సమస్య పోతుంది అంటుంది శివాని సింగ్.

Leave a comment