ఈ ఎండల్లో ఇంట్లో చేసుకున్న పానీయాలు వడ దెబ్బ నుండి రక్షణ ఇస్తాయి. నిమ్మరసంలోని విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తులసి ఆకుల గుజ్జులు నిమ్మరసం, నీళ్లు కలిపి తాగితే వడదెబ్బ నుంచి రక్షణ గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మామిడికాయలు విరివిగా వస్తున్నాయి. పచ్చి మామిడిని ఉడికించి  రసం తీసి వడకట్టి ఆ రసంలో జీలకర్ర పొడి ఉప్పు చల్లని నీళ్లు కలిపి తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది అలాగే పుదీనా రసంలో కొద్దిగా బెల్లం,జీలకర్ర పొడి నిమ్మరసం వేసి జ్యూస్ చేసుకోవచ్చు ఈ జ్యూస్ లు జీర్ణ క్రియ పని తీరును మెరుగు పరుస్తాయి. వీటిలో బి,పి విటమిన్లు ఇతర పోషకాలు ఉంటాయి.

Leave a comment