మహిళలకు నలభై ఏళ్ళు దాటాక చాలా శారీరక మానసిక సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించేందుకు నేను ఈత ఎంచుకున్నాను ఈ మధ్యనే కటాలీనా చానల్ ను, 10 గంటల నాలుగు నిమిషాలు 45 సెకండ్లు ఏకబిగిన ఈతకొట్టి రికార్డ్ సాధించాను అంటోంది స్విమ్మర్ గోలి శ్యామల. ఏదైనా సాధించేందుకు వయసుతో పనిలేదు ఎప్పుడు నదుల్లో దిగని నేను నలభై ఏడు సంవత్సరాల వయసులో శ్రీలంక జలసంధిని 30 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల నలభై మూడు నిమిషాల్లో ఈదిన తెలంగాణా తొలి మహిళగా గుర్తింపు పొందాను. ఈ సాహస క్రీడలు పేరు కోసమే కాదు శారీరక వ్యాయామం మానసిక దృఢత్వం కోసం అని గుర్తించండి అంటోంది గోలి శ్యామల.