ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన హ్యాండ్ బ్యాగ్ ఒక్క బిర్కిన్ కంపెనీ బ్యాగ్ మాత్రమే హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్. అసలు సామాన్యులు చాలామందికి దీని పేరే తెలియదు ప్రపంచవ్యాప్తంగా ఉండే కుబేరులు ఒక్క బిర్కిన్ బ్యాగ్ అయినా సొంతంగా ఉంచుకోవాలని కలలుకంటారు. సెలబ్రిటీల చేతుల్లోనే అరుదుగా ఈ బ్యాగ్ కనిపిస్తుంది. సాధారణంగా ఈ బ్యాగ్ ధర ఎనిమిదిన్నర లక్షల నుంచి రెండున్నర కోట్ల వరకు ఉంటుంది. లెదర్ రకాన్ని బ్యాగ్ ముందు భాగంలో వాడిన లోహాన్ని బట్టి ఖరీదు మారుతూ ఉంటుంది. బ్రిటిష్ గాయని విక్టోరియా బెక్‌హామ్ దగ్గర వందకు పైగా బిర్కిన్ బ్యాగులున్నాయట. వాటి విలువ పాతిక కోట్లకు ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా వేలంలో అమ్ముడయిన ఖరీదైన బ్యాగ్ హెర్మెస్ కంపెనీర్. అది 2.70 కోట్ల విలువ చేసే హిమాలయా బిర్కిన్ నిలోటికస్ ముసలి చర్మంతో తయారైనా ఈ బ్యాగ్ హాండిల్ దగ్గర భాగాలను బంగారంతో చేసి 240 వజ్రాలు పొదిగిగారు ప్రతి బిర్కిన్ బ్యాగ్ ని చేతితో కుడతారు. ఇందుకోసం నాలుగేళ్ల పాటు శిక్షణ తీసుకోవాలట. ఒక్క బ్యాగ్ కొట్టేందుకు ప్రతి ఒక్క ఉద్యోగి 50 గంటల సమయం పడుతుంది. బిర్కిన్ బ్యాగ్ ఇప్పుడు కొని మళ్లీ నాలుగేళ్ల తర్వాత అమ్మితే ఆ రోజు మార్కెట్ ధర ఎంత వుందో అంత ధర పలుకుతోంది.

Leave a comment