ఈ మధ్య కాలంలో ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబిదాను హాపర్ డాట్ కామ్ సంస్థ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత పేరు వచ్చింది. ఈ అమ్మాయి అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంక్  సంపాదించింది. తండ్రి, తాత, పెద్ద నాన్నల పేర్లు ఉపయోగించకుండా తన అభిరుచి సృజనాత్మకత తోనూ గుర్తింపు సంపాదించింది ఆశ్రిత. ఆహారం, ప్రయాణం నా అభిరుచులు, మా నాన్న వెంకటేష్ భోజన ప్రియులు ఆయన ఖీమా నెయ్యి వేడి అన్నంతో తినిపించిన రుచి నాకు ఎంతో నచ్చింది. మా నాన్న వెంకటేష్, పెద్దనాన్న సురేష్ ఆఫ్రికా యూరప్ వంటి ఖండాలకు షూటింగ్ ల నిమిత్తం వెళ్లినప్పుడు  అక్కడి రుచులు విశేషాలు చెప్పేవారు. నెమ్మదిగా వంట అంటే ఇష్టం మొదలైంది. వండిన రుచి చూసినా ఆ పదార్థాలు ఫోటోలు తీసుకోవటం బ్లాగ్ లో వ్రాయటం ఇన్ స్టా లో పోస్ట్ చేయటం మొదలు పెట్టాను ఇన్ఫినిటీ  ఫ్లాటర్ పేరు తో ఇన్ స్టా లో యూట్యూబ్ లో ఉన్న వీడియోలు పోస్ట్ చేశాను అంటోంది ఆశ్రిత దగ్గుబాటి. ఇన్ స్టా లో లక్ష యాభైతొమ్మిది వేల మంది, యూట్యూబ్ లో 81 వేల మంది ఆశ్రిత ను ఫాలో అవుతున్నారు. ఈ ఇన్ఫినిటీ ప్లాటర్ (infinity platter) మొదలు పెట్టినప్పుడు, ఆమెకు ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు కూడా ఆమె వెంకటేష్ కూతురిని ఎవ్వరికీ తెలియదు !

Leave a comment