భారతీయుల్లో చాలామందికి సంతాన సాఫల్యత గురించి పరిజ్ఞానం ఉండదు. ముఖ్యంగా వాళ్లకి అండాల వీర్యకణాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్న అంశాల గురించి అవగాహన ఉండదు అందుకే డాక్టర్ క్యూటరస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు. ప్రతి స్త్రీకి జననేంద్రియాల పై అవగాహన ఉండాలి అనుకుంటాను అంటుంది డాక్టర్ తాన్వి నరేంద్ర. ప్రతిష్ఠాత్మక రాయల్ సొసైటీ సభ్యురాలైన డాక్టర్ తాన్వి సోషల్ మీడియాలో పబ్లిక్ మెడికల్ ఎడ్యుకేషన్ రంగంలో ఎంతో కృషి చేస్తోంది స్పెర్మ్ అండాలను హాని చేసే విషయాలను సులభంగా అర్థం అయ్యే భాషలో చెబుతున్న తాన్వి ను నెటిజన్లు డాక్టర్ క్యూటరస్ అనే పిలుస్తారు. ఫెక్సువల్ హెల్త్ ఇన్ ఫ్లూయాన్సర్ గుర్తింపు పొందారు తాన్వి యాంబ్రియాలజీలో ఆక్స్ఫర్డ్ నుంచి మాస్టర్స్ చేశారు తాన్వి. లండన్ క్లినికల్ యాంబ్రియాలజీ చదివారు.

Leave a comment