ఈ కరోనా సమయాన్ని చక్కగా ఉపయోగించుకోండి, చక్కని హాబీలు ఎంచుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్ కోడింగ్ ,పెయింటింగ్,ఫోటోగ్రఫీ,వీడియో మేకింగ్,పేపర్ డ్రాఫ్ట్,స్కెచింగ్,ఒరిగామి ఇవన్నీ నేర్చుకోగలిన చక్కని హాబీలు అంటున్నారు. స్కూలు సమయాల్లో ఏది నేర్చుకోవాలన్న సరైన సమయం,ఫోకస్ పెట్టలేని వాళ్ళు ఇప్పుడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎన్నో వీడియోల్లో స్కెచింగ్ ,డ్రాయింగ్,మ్యూజిక్ గురించిన సమాచారం ఎంతో ఉంది. అలాగే ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే డిక్షనరీ దెగ్గర పెట్టుకొని రోజుకో పేజీ అర్ధాలు చూసుకొంటూ చక్కగా నేర్చుకోవచ్చు. లేదా ఇతర భాషలు ఏవైనా నేర్చుకొనేందుకు కూడా ఇది సరైన సమయమే. ఈ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటున్నారు నిపుణులు.

Leave a comment