కాశ్మీర్ లోయలో ఐదారు మంది ఆడపిల్లలు కలిసి సూఫీ గర్ల్స్ పేరుతో చక్కని భక్తి గీతాలు పాడుతున్నారు. కాశ్మీర్ లో సూఫీ సంగీతం పాడే బృందాలు లేవు మగవాళ్లే పాడుతున్నారు. కాశ్మీర్ లోని బండిపోర జిల్లా లో గవస్థాన్ అనే చిన్న పల్లెలో ఇర్ఫానా యాసఫ్ అనే కాలేజీ అమ్మాయి మొదట్లో ఈ భక్తి సంగీతం నేర్చుకుంది.  ఆమె వెనకాల ఇంకొందరు ముందుకొచ్చారు అమ్మాయిలు తల్లిదండ్రుల అంగీకారంతో ఈ కాశ్మీర్ సూఫియానా సంగీతాన్ని పాడటం మొదలుపెట్టారు తమ బృందానికి ‘వికసించే పూలు’ అనే పేరు పెట్టుకున్నారు ఈ సూఫీ గర్ల్స్.

Leave a comment