వర్షాల జోరులో రైస్ బ్రాత్ సూప్ తాగితే ఆరోగ్యం అంటున్నారు ఎక్సపర్ట్స్. బియ్యం వేయించి రవ్వగా మార్చాలి. ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఉడికించాలి. ఈ సూప్ లో ఉడికిన కూరగాయల ముక్కలు, అల్లం ముక్కలు, మిరియాలు, బిర్యాని ఆకులు వేసి ఇంకాస్త ఉడికిస్తే రుచి,పోషకాలు అందించే సూప్ తయారవుతోంది. అలాగే పాలల్లో బాదం పప్పుల పొడి,కుంకుమపువ్వు, జీడిపప్పు పొడి వేసి కేసరి పాలు తయారు చేసుకొని తాగితే శక్తి ఆరోగ్యం సొంతం అవుతాయి.

Leave a comment