ప్రముఖ స్త్రివాది ఫ్రిదా కహ్లో ప్రభావం నా పైన అమితంగా ఉంది ఆమె బాధలో ఉన్న అందాన్ని కనుక్కుంది రంగుల దుస్తులు ధరించి ఉత్సాహంగా ఉండేది.ఆమెను దృష్టిలో ఉంచుకుని  ఫ్రిదా పేరుతో ప్లస్ సైజ్ దుస్తులు వ్యాపారం మొదలు పెట్టాను అంటోంది మమతా శర్మ దాస్. ఇంస్టాగ్రామ్ లో ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని నడుపుతోంది ఆమె రూపొందించే దుస్తులు ప్రత్యేకం భారతీయ చేనేత దుస్తులతో ప్లస్ సైజ్ దుస్తులు తయారు చేయడం ఆమెను స్టైల్ ఐ కాన్ గా నిలబెట్టింది తరతరాలుగా నైపుణ్యం కలిగి ఉన్న హస్త కళాకారుల ప్రోత్సహించటం నాకు ఇష్టం.ఈ కరోనా తో  మూల పడ్డ చేనేత వస్త్ర వ్యాపారాన్ని ఖాతాదారులకు దగ్గర చేస్తున్నాను వాళ్ల జీవితాల్లో వెలుగు నింపటం నా ధ్యేయం అంటుంది మమతా శర్మ.

Leave a comment