గడ్డం కిందుగా చెంపల పక్కనే సన్నని నూగు వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి . పసుపులో పాలు కలిపి పేస్ట్ లాగా చేసి ఈ మిశ్రమంలో నెమ్మదిగా మర్ధన చేస్తూ ఉంటే అ సన్నని వెంట్రుకలు రాలిపోతాయి . చర్మానికి నిగారింపు కూడా వస్తుంది . దీన్ని చిన్నపిల్లలకు కూడా వాడవచ్చు . అలాగే నిమ్మరసం చక్కెర కలిపి అమిశ్రమాన్ని వలయాకారంలో రాస్తూ మర్దన చేయాలి. ఇలా కొన్నాళ్ళ పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది . ఈ అవాంఛిత రోమాలతో పాటు మృతకణాలు కూడా పోతాయి . పటిక మెత్తగా చేసి పాలతో కలిపి మర్దన చేసిన ఇది స్క్రబ్ లాగా పనిచేస్తుంది మృతకణాలు పోతాయి . కొన్నాళ్ళ పాటు రోజు చేస్తే సన్నపాటి వెంట్రుకలు రాలిపోతాయి .

Leave a comment