కళ్ల దగ్గర చర్మం పలచగా ఉండటంతో సూర్యరష్మిలోని హానికారక కిరణాలు కళ్ల దగ్గర చర్మాన్ని తొందరగా ముడతలు పడేలా చేస్తాయి.నల్లని వలయాలు ఏర్పడతాయి సహజ పద్ధతిలో ఈ వలయాలు పోగొట్టాలంటే ఎండలో బయటకి వెళ్లేప్పుడు క్రీమ్ రాసుకోవాలి.బంగాళదుంప లోని ఎంజైమ్స్ ఇన్ ఫ్లమేషన్ తగ్గించి కళ్ళకింద చర్మాన్ని బిగుతుగా చేస్తాయి.బంగాళదుంప పల్చగా ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో ఉంచాలి.వాటిని కళ్ళ పైన పెట్టుకొని ఆ చల్లదనం పోయేవరకు విశ్రాంతిగా ఉండాలి.అలాగే కీరదోస లో కూడా చర్మాన్ని మృదువుగా మార్చే గుణాలున్నాయి.టమాటో లోని లైకోపిన్ కూడా చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. కళ్ళ కింద నల్లని వలయాలు తగ్గిస్తుంది.చామంతి టీ లో యాంటీ ఆక్సిడెంట్లు,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.ఈ టీ లో దూది ముంచి కళ్ళ పైన పెట్టుకుంటే స్వాంతన కలుగుతుంది.

Leave a comment