ఎంతో మంది ఉద్యోగం చేసే వాళ్ళు సమయం కుదరక ఉదయపు అల్పాహారం మానేస్తు ఉంటారు. దీనివల్ల ఆఫీస్ పనిపైన ద్యాస తగ్గిపోతుంది. ఆకలి వేస్తూనే ఉంటుంది. ఉదయం సమయం దొరక్కపోతే ఉడికించిన గుడ్లు పండ్లు పాలు పెరుగు వంటివి తీసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనానికి రెండు గంటల ముందు ఐదారు బాదం గింజలు,లేదా ఒక పండు తీసుకోవచ్చు. భోజనం లో కూర,పప్పు క్యారెట్ కీరా టమాటా వంటి పచ్చి కూరల మోతాదుకు పెంచి అన్నం తగ్గించి తినాలి. సాయంత్రం వేళలో గ్లాసు మజ్జిగ,మొలకెత్తిన గింజలు దానిమ్మ గింజలు తీసుకోవచ్చు. రోజంతా కూర్చొని ఉంటే రక్త నాళ సమస్యలు వస్తాయి కనుక గంటకోసారి లేచి అటు ఇటు తిరగటం మంచిది. అలసట కూడా తగ్గుతోంది.

Leave a comment