అపురూపమైన ప్రేమబంధానికి ఉదాహరణలుగా రాధా కృష్ణులను గురించి చెపుతారు . శ్రీకృష్ణుడు ,యమునా విహారి ,గోపాలకుడు మురళీగాన వినోదుడు . ఈ అపురూపమైన అంశాలన్నీ పేర్చి,కూర్చి కళాకారులు రాధాకృష్టుల హోదాలు ,లాకెట్టు తయారు చేశారు . చెవిపోగుల్లో గొలుసులు అందంగా ఊగాడే  రాధా కృష్ణుల రూపాన్ని అమర్చి ఆప్రేమను ఆభరణాల్లోకి తేల్చారు కళాకారులు . వీటిని నల్లపూసల్లో ,లాకెట్లుగా ముత్యాల గొలుసుల్లో పథకాలుగా అమర్చారు . అందమైన ఈ హారాలు అపురూపమైన ప్రేమకు సాక్ష్యంగా అమ్మాయిల మెడల్లోకి వచ్చి చేరాయి .

Leave a comment