ఎవరేనా కుక్కనో పిల్లినో పెంచుకుంటారు. ఈ రష్యన్ దంపతులు ఒక సింహం పిల్లను జూ నుంచి కొనుక్కొని తెచ్చి పెంచుకుంటున్నారు. 2015 రష్యా లోని సంరస్క్ అనే ఊర్లో జూలీ అనే  మౌంటెన్ లయన్ కు మూడు పిల్లలు పుట్టాయి.ఓ పిల్లని పెంజా అనే ఊర్లో ఒక జూ వాళ్ళు కొనుక్కున్నారు మెస్సీ అనే పేరు పెట్టారు దానికి జబ్బు చేస్తే అధికారులు దానిని చంపేద్దామానుకున్నారు. ఇది తెలిసిన అలెగ్జాండర్ మేరియా అనే ఇద్దరు సైకియాట్రిస్ట్ లు దాన్ని ఇంటికి తెచ్చుకొన్నారు. ఈ దంపతులు దాన్ని భోజనం కోసం నెలకు నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ మెస్సీ అనే సింహం కోసం యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు దంపతులు దానికి తోడు ఎవరు లేరని ఇంకో చిరుతపులి ని కూడా కొనుక్కొచ్చారు వాళ్ళు వాళ్ళున్నది చిన్న ఊరు కనుక ఎవ్వరూ ఈ పులి గురించి ఫిర్యాదు చేయలేదు అధికారులు అభ్యంతరం చెప్పలేదు.

Leave a comment