యాపిల్ పై తొక్క తో వేసుకునే మాస్క్ ఆంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . యాపిల్ పై తొక్క ఎండనిచ్చి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడి రెండు స్పూన్లు తీసుకొని మజ్జిగ తో పేస్ట్ లాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ ని మొహానికి మెడ కీ మాస్క్ లా వేసుకొని అర గంట ఆరాక కడిగేయాలి. యాపిల్ తొక్క లో ఉండే విటమిన్లు పోషకాలు, దీని లోని పాలీ ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ నుంచి చర్మాన్ని కాపాడతాయి. ఇందులోని విటమిన్-సి యాంటి ఏజింగ్ గా పనిచేసి చర్మాన్ని మెరిపిస్తుంది.

Leave a comment