వెంట్రుకల ఆరోగ్యం కోసం, పొడవుగా పెరిగేందుకు ఇంట్లోనే పోషక భరితమైన శిరోజామృతాన్ని తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ నూనె కోసం పావు కప్పు ఆముదం పావు కప్పు కొబ్బరి నూనె టేబుల్ స్పూన్, మెంతులు టేబుల్ స్పూన్, నల్ల జీలకర్ర టేబుల్ స్పూన్, రోజ్ మేరీ ఆయిల్ రెండు చుక్కలు పిప్పర్ మెంట్ ఆయిల్ రెండు చుక్కలు కావాలి ముందుగా నల్ల జీలకర్ర మెంతులు కొబ్బరి నూనెలో వేసి పదిహేను నిమిషాలు మరిగించాలి. ఆముదం, రోజ్ మేరీ పిప్పర్ మెంట్ నూనెను కలపాలి. ఈ నూనెతో వెంట్రుకల కుదుళ్ల నుంచి సున్నితంగా మర్దన చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. తల వెంట్రుకలు పెరుగుతాయి.

Leave a comment