1999 లో మొదలయింది వీణా వాదిని స్కూల్ మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లా బుధేలా లో ఉన్న ఈ స్కూల్ ల్లో రెండు చేతులతో రాయగలిగే ‘యాంబీ డెక్ట్రాస్’ అనే విధానాన్ని నేర్పుతారు పాఠశాల వ్యవస్థాపకుడు పీ.వీ శర్మ సంవత్సరాల తరబడి సాధన చేసి రెండు చేతులతో రాయటం, పైగా ఒక చేత్తో ఒక భాష మరో చేత్తో మరో భాష రాయటం సాధించారు. తను నడిపే వీణా వాదిని స్కూల్లో ఈ రాయడం సాధన చేయిస్తారు ఇలా చేస్తే విద్యార్థి ఏకాగ్రత ఆలోచన శక్తి భాషా నైపుణ్యాలు పెరుగుతాయని శర్మ గారు చెబుతారు. ఇప్పటి వరకు ఈ స్కూల్ లో వెయ్యి మందికి పైగానే సవ్య సాచులు తయారయ్యారు.

Leave a comment