ప్రతి వ్యక్తికీ ఒక ప్రత్యేకత ఉంటుంది . ఆ  ప్రత్యేకతతోనే గుర్తింపు పొందుతారు . అలా పదిమందిలో ప్రత్యేకంగా కనిపించాలి అనుకొంటే ఏదో ఒక రంగంలో నిష్టాతులై ఉండాలి . అలా  ప్రత్యేకత సంతరించుకున్న స్కూలు మధ్య ప్రదేశ్ లోని సింగ్రేలి  జిల్లా బుదేలా ఉన్నా వీణావారిని స్కూలు ఆ స్కూల్ లో ఏ క్లాస్ కి వెళ్ళినా పిల్లలు రెండు చేతులలో రెండు పెన్నులు పెట్టుకొని రాస్తూ కనిపిస్తారు . ఇదేదో పుట్టుక నుంచి రాలేదు . ఆ స్కూలు ఉపాధ్యాయాలు  పి.వి  శర్మగారి కృషి ఇది . మిగతా సబ్జెక్టుల వల్లే ఈ రాసేందుకు కూడా శిక్షణ ఇస్తారు . ఒక చేత్తో ఒకభాష ,ఇంకోచేత్తో ఇంకో భాషను రాస్తారట . ఏకాగ్రత పెరగటం కోసం ఈ శిక్షణ ఉపయోగ పడుతుంది అంటున్నారు .

Leave a comment