చర్మ సౌందర్యం కోసం ఏ సౌందర్య ఉత్పత్తులు వాడినా చర్మ సౌందర్యాన్ని మెరిపించే ఈ స్మూతీని   తప్పకుండా తినండి అంటున్నారు చర్మ నిపుణురాలు గీతిక.  పెద్ద సైజు అరటిపండు, అవిసె గింజలు టేబుల్ స్పూన్ పాలు లేదా యోగర్ట్ అర కప్పు బాదం బట్టర్ లేదా  పీనట్ బట్టర్ టేబుల్ స్పూన్ తీసుకుని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. స్మూతీ చల్లగా ఉండాలి అనుకుంటే అరటిపండుని ఫ్రిజ్ లో  పెట్టుకోవాలి.అవిసె గింజలు చర్మానికి లోపలనుంచి తేమను అందిస్తాయి. బాదంలోని ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు విటమిన్లు ఒంట్లోని విషపదార్థాలను బయటకు పంపి చర్మాన్ని కాంతిమంతంగా చేస్తాయి.

Leave a comment