ఇతిహాసాల్లో పురాణాల్లో చాలా గమ్మత్తయిన విషయాలు ఉంటాయి. సాధారణంగా తెలుపు కి చాలా ప్రాధాన్యత ఇస్తారు మనుష్యులు. తెలుపు వర్ణం తో ఉండే అది సౌందర్యం అనుకొంటారు పురాణాలు పరంగా చూస్తే ఎంతో అందమైన రూపంతో ఉంటాడని చెప్పే మన్మధుడు నల్లనివాడు. కీచకుడి తో పాటు,ఆమెను చుసిన వారు ఎవ్వరూ కళ్ళు తిప్పుకోలేనంత సౌందర్యవతి అని చెప్పే ద్రౌపతి నలుపు. ఆమే కృష్ణ (నల్లనిది) అని పిలుస్తారు. పురుషులకు కూడా మోహం తెప్పించేంత అందగాడని చెప్పే శ్రీరాముడు కూడా నల్లనివాడే. ఐశ్వర్యాలని ప్రసాదించే లక్ష్మికి ఇష్టమైన తిధుల్లో అమావాశ్య వుంటుంది.

Leave a comment