ఆకుకూరలు కాయిగూరలు ఖరీదు ఎంతుంటాయి చెప్పండి మహా అయితే కిలో వందో రెండువందలో అంటే మనం కళ్ళు తేలేస్తాం మరీ అంతఖరీదా అని.. కానీ కేజీ దాదాపు లక్ష రూపాయిలు పలికే కూరగాయి ఒకటి ఉంది. దాని పేరు హాఫ్ షూట్స్ ప్రపంచంలోకెల్లా ఖరీదైన కాడ కూర ఇది ఈ మొక్క లోని భాగాలు అన్ని ఔషధాలే కావడంతో దాన్ని కూరగాయ గా వాడటమే కాదు మందుల తయారీలో కూడా వాడుతుంటారు హాఫ్ షూట్స్ లోని ఔషధ గుణాలు ఎనిమిదివ శతాబ్దంలోనే గుర్తించారట. తొలిసారిగా జర్మన్లూ తరువాత ఆంగ్లేయులు ప్రారంభించారు. ఇంగ్లాండ్ లో బీరు తయారు చేస్తే అందులో తప్పనిసరిగా హాఫ్ షూట్స్ వాడాల్సిందే అనే నిబంధన ఉంది వీటి పూల  వాసన వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందట. రోజుకు ఆరు అంగుళాల పొడవుతో ఎంతో వేగంగా పెరుగుతాయి హాఫ్ షూట్స్. ముఖ్యంగా మొక్క వేరు మొదలు నుంచి వచ్చే కాడలు లేతగా ఉన్నప్పుడు ఉదా రంగులో ఉండి ఆకులు పెరుగుతూ ఆకుపచ్చ లోకి మారుతాయి. ఈ రెండు దశల్లోనూ వీటిని ఇష్టంగా తింటారట. వీటి కాడల్ని సలాడ్స్ లో గ్రిల్ చేసి ఉడికించి తింటారు. వెనిగర్ లో నిల్వ చేసి కూడా తినవచ్చు. హాఫ్ షూట్స్ లోని యాంటీ ఆక్సిడెంట్లు వయసు మీద పడనీయవన్న కారణం తో వీటికి గిరాకీ  ఎక్కువ యాంటీ బయోటిక్ గుణాలు ఎక్కువ గా ఉండే వీటి కాడలు టీబీ వ్యాధి ని తగ్గిస్తాయి అంటారు. ఇలాంటి ఔషధాలు నిండిన కూరగాయని వెతుక్కుని మరీ తినాలి కదా ! కాకపోతే కిలో ఒక లక్ష ఉండటం ఆశ్చర్యం .

Leave a comment