ఆరు నెలలు దాటినా పిల్లలకు తల్లిపాలతో పాటు ఘనాహారం ఇవ్వాలి . ఐదో ఏడు వచ్చేవరకు చక్కర,బెల్లం వంటి తీపి పదార్దాలు పిల్లలకు పెట్టక పోవటం మంచిదే . బెల్లానికి బదులుగా అరటి పండు ,ఉడికించిన ఆపిల్ గుజ్జు ఇవ్వచ్చు . జావ లో పెరుగు లేదా మజ్జిగ కలిపి ఇవ్వచ్చు . మెత్తగా చేసిన అన్నం పప్పు చారు ఇవ్వచ్చు. బియ్యం పెసరపప్పు బాదం ,జీడిపప్పు ,పిస్తా మొదలైనవి కలిపి రవ్వల చేసి దాన్ని నీళ్ళలో ఉడికించి అందులో రసం కలిపి ఇవ్వాలి . పాలపళ్ళు వస్తూ ఉంటాయి కనుక వండిన కూరగాయలు మెదిపి అన్నంలో కలిపి తినిపిస్తే మంచిది రాగిజావ కూడా పిల్లలకు మంచి ఆహారం .

Leave a comment