కమలా పండులో కన్నా పై తొక్కలోనే ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు నిండుగా ఉన్నాయంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ఈ తొక్కలో ఉండే తెల్లని భాగంలో పీచు పదార్థం,ఫ్లెవనాయిడ్లు ఎ,బి,సి విటమిన్లు కాల్షియం పుష్కలంగా ఉంది. ఈ తొక్కను ఎండబెట్టి పొడి చేసి పెసర పిండిలో కలపి వంటికి రుద్దుకొంటే చర్మం బావుంటుంది. ఈ తొక్కలో యాంటీ అలర్జీటెక్ యాంటీ ఇన్ ఫ్లమెటరీ లక్షణాలున్నాయి. ఇవి అలర్జీలను తగ్గించే రసాయనాలను విడుదల చేస్తాయి.ప్లేవనాయిడ్లు రక్త పోటును అదుపులో ఉంచుతాయి. ఈ తొక్క ఎండిన పొడిని టీలో వేస్తే జీవక్రియలు వేగవంతం అవుతాయి.కమలా పండు తొక్క ఎండనిచ్చి పొడి చేసి పడుకునే ముందర దంతాల పై రుద్దితే దంతాల పై ఉండ పసుపు రంగు దుర్వాసన తగ్గుతుంది.

Leave a comment