“నాట్యమయురి” గా పేరు గడించిన తోలేటి వెంకట శిరీష హైదరాబాద్ లో నివాసం ఉంటారు. కూచిపూడి నృత్యం, కర్నాటక సంగీతం మరియు వైణిక కళాకారిణి.”నృత్యాంజలి” సంస్థను స్థాపించి వేలాది శిష్యులకు శిక్షణ,మంచి వేదికలపై, దేశ-విదేశాల్లో ప్రదర్శనలు.ఈటీవీ, ఈటీవీ2,జెమిని, భక్తి, వనిత, యస్విబిసి,దూరదర్శన్ లలో కార్యక్రమాల ప్రసారం. వివిధ సంస్థలతో మంచి ప్రశంసలు, అవార్డులు.ముఖ్యంగా “మానసిక వికలాంగుల”వికాసం కోసం సంగీతంలో ని కొన్ని రాగాలతో నృత్యాన్ని మేళవించి “తిల్లానా”రూపకల్పన చేయడం. 20 మంది చిన్నారులకు ఉచిత శిక్షణ.రచయిత్రిగా కొన్ని కవితలు: మా ఊరు, కూతురు, అమ్మా -నేను-నాన్న,నేస్తం, ఉగాది ఊసులు, బంధం కవితలు శిరీష సొంతం.

Leave a comment