కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ తో సినిమాల్లోకి వచ్చింది నభా నటేష్. ఇప్పుడు తాజాగా సుధీర్ బాబుతో నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది. 2013 ఫెమినా మిస్ ఇండియా ఇంటెలెక్ట్యువల్ గా ఎంపికైన నభా నృత్యం,పెయింటింగ్లో నిష్ణాతురాలు.బి.ఇ పూర్తి చేసిన రఘుబాబు సినిమా అదిగో తో తెలుగు సినిమాల వైపు వచ్చింది నభా నటీష్.నన్ను దోచుకొందువటే చిత్రం గురించి చెబుతూ ఈ చిత్రంలో నా పేరు సిరి .బోలెడన్నీ గొప్పలు చెప్పుకొంటుంది. హుషారుగా ఉంటుంది. కథనాయకుడిని ప్రేమలో పడేసేందుకు చేసే ప్రయత్నాలు అందరికీ నచ్చుతాయి. నేను ఏదైనా చాలా తొందరగా నేర్చుకొంటాను .ఇప్పుడిప్పుడే తెలుగు భాష వచ్చేస్తోంది ఆంటోంది ఈ కన్నడ అమ్మాయి నభానటేష్.

Leave a comment