స్పోర్ట్స్ అంటే నాకు ఎంతో ఇష్టం క్రీడాకారుల రియల్ హీరోస్ అంటుంది తాప్సీ. శభాష్ మిథు చిత్రంలో నటించే వరకు నాకు బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు ఏ కొత్త కథ వచ్చిన వదులుకోకూడదు అన్న ఆలోచనతోనే స్పోర్ట్స్ చిత్రాలు మొదలు పెట్టాను. రస్మీరాకెట్ తరువాత నన్ను నేను చూసుకొంటే శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉన్నాను అనిపించింది. పింక్, థప్పడ్ చిత్రాల తర్వాత నన్ను నేను మెరుగు మెరుగు పరుచుకొన్నానని అర్థం అయింది. ఈ స్పోర్ట్స్ సినిమాలో నా స్టామినా, బలం కూడా పెరిగింది అంటోంది తాప్సీ. ఫిట్ నెస్ పట్ల నా భావాలు పూర్తిగా మారిపోయాయి. శారీరకమైన బలం మనసుని మనల్ని కూడా శక్తిమంతంగా మార్చేస్తాయి అంటోంది తాప్సీ.