ఎప్పుడూ ఎ సి గదుల్లో ఉండటం కంప్యూటర్ల ముందు పనిచేయడం తో సూర్యరశ్మి శరీరానికి తాకటం అరుదై పోయింది.ముఖ్యంగా వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతుంది బ్యాక్టీరియా వైరస్ లు పెరిగే ప్రమాదం ఉంది.ఉదయం ఎ సి లు రెండు గంటలపాటు ఆపేసి కిటికీ లన్ని తెరిచి ఉంచాలి.దీనివల్ల గదిలోని ఫంగస్ వెళ్ళిపోతుంది. ప్రతిరోజూ తప్పని సరిగా సూర్యకిరణాలు మీద పడే లాగా కాసేపు ఎండలో అటూ ఇటూ తిరగాలి. ఇటు వాకింగ్ అటు శరీరం పైన ఎండ పడటం ఒకేసారి జరుగుతుంది.కరోనా కాలంలో బయట ప్రదేశాల్లో నడక వ్యాయామం కోసం వెళ్లనక్కర లేదు. ఇంట్లోంచే హాయిగా అన్ని గదుల్లోకి ఓ గంటసేపు తిరిగిన చాలు.ఈ నడక శరీరాన్ని చైతన్యంతో నింపుతుంది.

Leave a comment